Kajjikayalu Recipe In Telugu How To Make Kajjikayalu In Telugu
పదార్థాలు (Ingredients):
- మైదా పిండి – 2 కప్పులు,
- సూజీ రవ్వ – 1¼ కప్పులు(పిండి కోసం అర కప్పు + స్టఫింగ్ కోసం ముప్పావు కప్పు),
- ఉప్పు – చిటికెడు,
- నెయ్యి – 2–3 టీస్పూన్లు,
- నీరు – అవసరమైనంత,
- ఎండు కొబ్బరి తురుము – 1 కప్పు,
- తరిగిన డ్రై ఫ్రూట్స్ – అర కప్పు,
- తురిమిన బెల్లం – 1 కప్పు,
- యాలకుల పొడి – అర టీస్పూన్,
- డీప్ ఫ్రైకి నూనె – సరిపడా.
Kajjikayalu Recipe In Telugu: ఈరోజు మనం పండగ స్పెషల్ గా కజ్జికాయల రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మనం ఈ విధంగా ఎప్పుడు చేసిన కజ్జికాయలు కరకరలాడుతూ కమ్మనైన స్టఫింగ్ తో చాలా రుచిగా ఉంటాయి. అంతేకాదు ఇందులో పంచదార వేయకుండా ఆరోగ్యకరంగా బెల్లంతో చూపిస్తున్నానండి. ఇలా హెల్దీ ఆప్షన్ తో రుచిగా చేసుకోవచ్చన్నమాట.మరొకటి ఏంటంటే కజ్జికాయల పీట లేకపోయినా ఈజీ మెథడ్ లో ఎలా చేయాలో క్లియర్ గా మెన్షన్ చేశాను. ఇలా మీరు కూడా ఎక్కువ శ్రమ పడకుండా బ్రహ్మాండమైన రుచితో కజ్జికాయల్ని చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మరి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి.
ముందుగా పిండిని కలిపి తీసుకుందాం. ఒక బౌల్ లోకి రెండు కప్పుల మైదా పిండిని తీసుకోండి. అలాగే వెయిట్ వైస్ ఇక్కడ నేను 1/4 కేజీ వరకు మైదా పిండిని తీసుకున్నాను. ఇందులోనే ఒక అర కప్పు వరకు సూజి రవ్వను తీసుకోండి. దీంతో కజ్జికాయల పైన పిండిపూర అనేది కరకరలాడుతూ ఉంటుంది. అలాగే ఇందులోనే చిటికెడంత ఉప్పును తీసుకోండి. అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోండి. నెయ్యి వద్దనుకునేవారు నూనెనైనా లేదా ఇంట్లో చేసిన వెన్నెనైనా వాడొచ్చు. ఇలా తీసుకున్నాక పిండికి పట్టేలా అంతా కలిసేలా కలపండి.
Kajjikayalu Recipe In Telugu
ఇలా కలిపాక పిండి అనేది కొంచెం ముద్ద కట్టేలా ఇలా వస్తుంది. ఇలా వచ్చిందంటే కజ్జికాయల పైన పొర అనేది కరకరలాడుతూ ఉంటుంది. ఒకవేళ మీకు పిండి మరీ పొడి పొడిగా ఇలా ముద్ద కట్టేలా రాకపోతే మరో ఒకటి రెండు టీస్పూన్ల నెయ్యిని వేసి బాగా కలిపి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళను వేస్తూ పిండి ముద్దలా కలిపి తీసుకోండి.పిండిని మరీ మెత్తగా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్ గా ఇలా కలిపి తీసుకోండి. సో ఇలా కలిపిన పిండిని మనం స్టఫింగ్ చేసేంతవరకు మూత పెట్టి రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒకటి రెండు టీస్పూన్ల నెయ్యిని తీసుకోండి.
ఇప్పుడు ఇందులోకి ఒక ముప్పావు కప్పు సూజీ రవ్వను తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి.మనకు ఈ కజ్జికాయల స్టఫింగ్ మంచి రుచిగా రావాలంటే రవ్వ లోపలి వరకు బాగా వేగేలా ఇలా కలుపుతూ చక్కగా ఫ్రై చేయండి. ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేశాక ఇందులోకి సన్నగా తరిగిన డ్రై నట్స్ ని ఒక అర కప్పు వరకు తీసుకోండి. అలాగే ఇదే టైంలో ఒక టీస్పూన్ నెయ్యిని తీసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేశారంటే రవ్వ కలర్ మారుతుంది కానీ రుచి అనేది అంత బాగా అనిపించదు కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ఇలా కలుపుతూ మరొక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేయండి.
దీంతో రవ్వ డ్రైనర్స్ చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టి గ్రేట్ చేసిన ఎండు కొబ్బరి తురుమును ఫుల్ గా ఒక కప్పు వరకు తీసుకోండి. ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజు ఎండు కొబ్బరిలను తీసుకొని గ్రేట్ చేసి తీసుకున్నాను. ఎండు కొబ్బరిని మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు తీసుకోండి. ఇలా పక్కకు తీసుకున్నాక మీరు కావాలంటే ఈ స్టఫింగ్ ని వేరొక గిన్నెలోకైనా తీసుకోవచ్చు లేదా ఇలా పాన్ లోనే ఉంచుతున్నట్లయితే మధ్య మధ్యలో కలుపుతూ కాస్త చల్లారనివ్వండి.
ఇందులోకి మనం స్వీట్ కి సరిపడా బెల్లాన్ని తురిపి తీసుకుందాం. ఇక్కడ నేను బెల్లం వాడుతున్నాను. మీరు బెల్లానికి బదులుగా చక్కెర వాడాలనుకుంటే చక్కెరనైనా తీసుకోవచ్చు. ముందుగా మనం తీసుకున్న ఈ బెల్లాన్ని గ్రేట్ చేసి తీసుకుందాం. ఇలా గ్రేట్ చేసి వేయడం వలన స్టఫింగ్ లో బెల్లం చక్కగా కలిసిపోతుంది. చూడండి ఇలా గ్రేట్ చేసిన బెల్లాన్ని రవ్వ కొబ్బరిని కొలిచి తీసుకున్నాము. అదే కప్పుతో ఈ తురిమిన బెల్లాన్ని కూడా ఒక కప్పు వరకు కొలిచి తీసుకోండి. ఈ క్వాంటిటీ మెజర్మెంట్స్ తో చేస్తే స్టఫింగ్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఇలా తీసుకున్న ఒక కప్పు బెల్లం తురుమును స్టఫింగ్ లోకి తీసుకోండి.
Kajjikayalu Recipe In Telugu
ఇలా మనం బెల్లం తురుమును తీసుకునేటప్పుడు కంప్లీట్ గా చల్లారిపోయి ఉండాలి. ఒకవేళ మీరు బెల్లానికి బదులుగా చక్కర తీసుకోవాలనుకుంటే 3పా4 కప్పు చక్కరను తీసుకొని గ్రైండ్ చేసియినా తీసుకోవచ్చు.ఇలా ఒకసారి అంతా కలిసేలా కలిపాక ఇందులోకి అర టీస్పూన్ యాలకుల పొడిని తీసుకొని మరొకసారి బాగా కలిపామంటే స్టఫింగ్ తయారైనట్లే అలాగే ఇక్కడ మీకు మరొక విషయం చెప్పాలండి ఒక్కోసారి మనం స్టఫింగ్ చేసేటప్పుడు రవ్వ గాని లేదా కొబ్బరి కానీ కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంటాయి. కాబట్టి ఈ టైంలో టేస్ట్ చేసి స్వీట్నెస్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న ఈ క్వాంటిటీ కైతే స్వీట్ కరెక్ట్ గా సరిపోతుంది.
సో మనం తయారు చేసిన ఈ స్టఫింగ్ ని రెడీగా పక్కనుంచి కలిపి పెట్టిన పిండిని తీసుకోండి. చూడండి పిండి కూడా చక్కగా నానింది. ఇప్పుడు ఈ పిండి ముద్దను మరొక రెండు నిమిషాల పాటు బాగా నీట్ చేయండి. ఇలా నీట్ చేశాక చిన్న చిన్న పిండి ముద్దలా డివైడ్ చేసి తీసుకోండి.రౌండ్ బాల్ లా ఇలా చుట్టతూ తీసుకోండి. ఇలా అన్ని పిండి ముద్దలా చుట్టాక ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుంటూ మిగతా పిండి ఆరిపోకుండా కవర్ చేసి పక్కన ఉంచండి.
ఇప్పుడు ఈ పిండి ముద్దను పొడి పిండిలో డిప్ చేసుకుంటూ రోల్చేసుకుందాం.మరీ పల్చగా మరీ మందంగా కాకుండా ఈ థిక్నెస్ లో రోల్ చేయండి. అయితే ఇలా రోల్ చేసి చేయడం వలన ఒక్కోట అనేది సైజ్ మారుతూ ఉంటుంది. అన్ని ఒకే సైజు లో రావాలంటే అడ్జెస్ షార్ప్ గా ఉండే ఇలా బాక్స్ మూతను తీసుకొని దీనిపైన నొక్కి తీసుకున్నామంటే రౌండ్ షేప్ లో కజ్జికాయలు కూడా అన్ని సేమ్ సైజు లో వస్తాయి.
ఇలాగే ఒక్కొక్క పిండి ముద్దను పొడి పిండిలో డిప్ చేసుకుంటూ రోల్ చేయండి. ఇలా మనం ఒక్కొక్కటి చేస్తూ అయినా చేయొచ్చు లేదా కొన్ని కొన్ని పూరీలా చేశకైనా స్టఫ్ చేసుకోవచ్చుఅన్నమాట. ఇక్కడ నేను సగం వరకు రోల్ చేశక స్టఫ్ చేసే విధానాన్ని చూపిస్తున్నానండి. ఒక్కొక్క పూరీని తీసుకుంటూ ముందుగా చుట్టూర కొంచెం నీళ్ళతో తడి చేయండి. దీనిలోకి రెండు మూడు టీస్పూన్ల స్టఫింగ్ ని తీసుకోండి. ముందుగా నార్మల్ గా ఎలా ఫోల్డ్ చేస్తారో చూపిస్తాను. మనం ఇలా పైన తీసుకొని ఫోల్డ్ చేసామంటే స్టఫింగ్ అనేది కింద లేయర్ పైన పడిపోయి సరిగ్గా అతుక్కోదు.
ఇలా కాకుండా ఇంకా ఈజీ మెథడ్ లో ఎలా ఫోల్డ్ చేయాలంటే స్టఫింగ్ ని తీసుకున్నాక ఈ కింద పొరును పట్టుకొని పైన పొరను ఇలా కలపండి ఇలా చేయడం వలన స్టఫింగ్ ఎడ్జెస్ కి అతుక్కోకుండా ఈజీగా క్లోజ్ చేయొచ్చు ఇలా చేశాక మళ్ళీ టేబుల్ పైన పెట్టి కాస్త నొక్కి తీసుకోండి ఇలా నొక్కాక ఎడ్జెస్ కి మంచి డిజైన్ ఇవ్వడానికి ఫోర్క్ స్పూన్ తో ఇలా డిజైన్ ఇచ్చి తీసుకోండి ఇలా మనం కజ్జికాయల పీట లేకపోయినా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మరొక మెథడ్ ఏంటంటే ఇలా చేతిలోకి తీసుకొని ఎడ్జెస్ ని కొంచెం నీళ్ళతో తడి చేసి స్టఫింగ్ ని తీసుకొని ఇలా అయినా క్లోజ్ చేయొచ్చు. ఏ మెథడ్ లో క్లోజ్ చేసిన ఎడ్జెస్ కి స్టఫింగ్ తలగకుండా చేసుకోవచ్చన్నమాట.
Kajjikayalu Recipe In Telugu
మీ దగ్గర ఇలాంటి చెక్క పీట ఉంటే ఈ చెక్క పీట పైనైనా పూరీ సైజ్ అంతా రోల్ చేసి తీసుకొని దీనికి కూడా ఎడ్జెస్ ని కొంచెం నీళ్లతో తడి చేసి స్టఫింగ్ ని తీసుకొని ప్రెస్ చేశారంటే కజ్జికాయల షేప్ వచ్చేస్తుంది. ఇలా కజ్జికాయల పీట ఉన్నా లేకపోయినా కష్టపడకుండా చేసుకోవచ్చన్నమాట. సో ఇలా అన్ని ప్రిపేర్ చేశాక ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని తీసుకొని మీడియంగా వేడి చేయండి. ఆయిల్ మీడియంగా వేడయ్యాక ఇందులోకి సరిపడన్ని కజ్జికాయల్ని తీసుకొని మీడియం మంట పైనే ఫ్రై చేయండి. వీటిని హై ఫ్లేమ్ లో ఫ్రై చేశారంటే బయటకి తీసాక మెత్తబడిపోతాయి కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి మంచి కలర్ వచ్చేంతవరకు టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్ అండి.
హై ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే తర్వాత మెత్తబడిపోతాయి అనేది మర్చిపోవద్దు.కాబట్టి కజ్జికాయల్ని మీడియం మంటపైనే బాగా ఫ్రై చేసి తీసుకోండి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయి లైట్ గా కలర్ మారాయ అంటే ఇవి చక్కగా ఫ్రై అయినట్లు ఇలాగే మిగతావి కూడా బ్యాచెస్ గా తీసుకుంటూ ఫ్రై చేసి తీసుకోవడమే అలాగే చెప్పలేదు కదా మనం చేసిన ఈ క్వాంటిటీకి కజ్జికాయలు 25 వరకు వచ్చాయి. స్టఫింగ్ పిండి కరెక్ట్ గా సరిపోయాయి. సైజు ని బట్టి ఒక రెండు మూడు అటు ఇటు కూడా కావచ్చండి. మీరు కూడా ఈసారి పండక్కి కజ్జికాయలు చేస్తున్నట్లయితే ఇలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా కరకరలాడుతూ చాలా చాలా బాగుంటాయి. అలాగే మీరు ట్రై చేశక మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు.Kajjikayalu Recipe In Telugu

